గాంధీ భవన్లో కీలక భేటీ..
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సందీప్ కుమార్ తో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 22 : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి బి.సందీప్ కుమార్ ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి(Telangana Youth Congress President Jakkidi Shiva Charan Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ... సందీప్ కుమార్ సైతం విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, యువజన కాంగ్రెస్, ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారన్నారు. ఆయన అనుభవం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ నేతృత్వంలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.