రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మరొకరికి గాయాలు
న్యాల్కల్, నవంబర్ 9 : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన గంగ్వార్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి హద్నూర్ ఎస్ఐ దోమసుజిత్(Hadnoor SI Doma Sujith) తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) న్యాల్కల్ గ్రామానికి చెందిన బొల్లిశ్రీకాంత్(19)తన స్నేహితుడైన ఎరుకల సాయికిరణ్ లు మహేంద్రా పరిశ్రమలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కంపెనీకి సోమవారం ఉదయం మోటర్ సైకిల్ పై వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో హద్నూర్ నుండి గంగ్వార్ వెళ్లే మార్గంలో రోడ్డుపై అజాగ్రత్తగా నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో బైక్ పై ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా బొల్లి శ్రీకాంత్ మార్గమధ్యలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ సాయికిరణ్ ను మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ దోమ సుజిత్ తెలిపారు. కాగా అజాగ్రత్తగా రోడ్డుపై నిలిపిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు మృతుని తండ్రి బొల్లి సంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.