రక్షిత సంచలనం
ఒలింపిక్ విజేతకు షాకిచ్చిన భారత యువ షట్లర్
హాంకాంగ్ ఓపెన్
కౌలూన్, నవంబర్ 19: భారత బ్యాడ్మింటన్‌లో మరో యువ షట్లర్ దూసుకొస్తోంది. 19 ఏళ్ల రక్షిత రామ్‌రాజ్(Indian shuttler Rakshitha Ramraj) ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా రక్షిత హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో ఒలింపిక్ ఛాంపియన్ ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫీకి షాకిచ్చింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఈ భారత యువ షట్లర్ 21 స్కోరుతో చెన్ యుఫీపై సంచలన విజయం సాధించింది. తద్వారా రక్షిత తన కెరీర్‌లో తొలిసారిగా ఒక బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 19 ఏళ్ల రక్షిత ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉంది.
ఈ విజయంతో ఆమె అరుదైన రికార్డు అందుకుంది. 2019 తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై చెన్ యుఫీని ఓడించిన తొలి భారతీయ క్రీ డాకారిణిగా నిలిచింది.అంతకుముందు రక్షి త ప్రదర్శనతో డెన్మార్క్ స్టార్ షట్లర్ మియా బ్లిచ్ఫెల్ట్ పై 21 21- తేడాతో గెలుపొందింది. కాగా చెన్ యుఫీతో మ్యాచ్‌లో రక్షిత ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఒత్తిడి లేకుండా తెలివైన డిసెప్షన్ షాట్లు, అటాకింగ్ స్ట్రోక్స్‌తో పై చేయి సాధించింది. తాను ఎంతో అభిమానించే చెన్ యుఫీని ఓడించడం తన కెరీర్లో అత్యంత మధురమైన రోజుల్లో ఒకటని మ్యాచ్ అనంతరం రక్షిత పేర్కొంది. సెమీఫైనల్ బెర్త్ కోసం రక్షిత, థాయ్‌లాండ్‌కు చెందిన పోర్నావీ చోచువాంగ్‌తో తలపడనుంది.