డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్
ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ
షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశవ్యాప్తంగా క్రీడానైపుణ్యాన్ని వెలికితీసే ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games)కు ఈ సారి తెలంగాణ ఆతిథ్యమిస్తోంది. తాజాగా ఈ ఎడిష న్‌కు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణ తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ క్రీడలు డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. మొ త్తం 27 ప్రధాన క్రీడలతో పాటు ఒక ప్రచార క్రీడ ఉండబోతుంది.12 రోజుల పాటు జరిగే ఈ గేమ్స్‌లో దాదాపు 6000 మంది క్రీడాకారులు, పాల్గొనే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో ప్రధాన క్రీడా పోటీలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో 22 మెడల్ స్పోర్ట్స్ ఈవెంట్లు జరగ నున్నాయి. మిగతా క్రీడా పోటీలు తెలంగాణలోని ఇతర ఐదు నగరాల్లో నిర్వహించనున్నారు. ఆర్చరీ పోటీలకు ఖమ్మం ఆతిథ్యం ఇవ్వనుండగా.. హన్మకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, నిజమాబాద్‌లో టేబు ల్ టెన్నిస్, మహబూబ్ నగర్‌లో కబడ్డీ పోటీ లు నిర్వహించనున్నారు. ఈ సారి సాఫ్ట్‌బాల్ తొలిసారి అడుగుపెట్టనుండగా, సెయిలింగ్‌ను ప్రచార క్రీడగా ప్రవేశపెట్టారు. గతేడాది బీహార్ వేదికగా జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ 23 పతకాలతో 12వ స్థానంలో నిలిచింది.