తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం

18-11-2026 | 05:05am

మంత్రి వాకిటి శ్రీహరి పిలుపు

హైదరాబాద్, నవంబర్ 17 : తెలంగాణ రాష్ట్రాన్ని(Telangana State) దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా(Sports Hub) తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games) 2026 నిర్వహణ తెలంగాణ క్రీడా చరిత్రలో(History of Sports in Telangana) ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోందని పేర్కొన్నారు. మంగళవారం ఇన్వెస్ట్ తెలంగాణ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంశాలపై క్రీడా ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణకు తీసుకురావడం ఒక గొప్ప అవకాశమైతే, వాటిని దేశంలోనే అత్యుత్తమంగా నిర్వహించడం అంతకంటే పెద్ద బాధ్యతగా పేర్కొన్నారు. గతంలో ఏడు ఎడిషన్లలో జరిగిన క్రీడా పోటీలకంటే మెరుగైన ప్రమాణాలతో ౮వ ఎడిషన్‌ను నిర్వహించి తెలంగాణ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు