అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష
- 15 అంశాలపై జడ్పీ సీఈవో శిరీష ఆరా
- ఉపాధి హామీ, జల సంరక్షణ పనుల పురోగతిపై చర్చ
- పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలపై సమీక్ష
- పారిశుద్ధ్యం, పశువుల నీటి తొట్టెల పనుల పరిశీలన
- పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
మోతె, నవంబర్ 12 (విజయ క్రాంతి): మండలంలోని పంచాయతీరాజ్ శాఖ(Panchayati Raj Department) అభివృద్ధి పనుల పురోగతిపై జడ్పీ సీఈవో శిరీష(Zilla Parishad CEO Shirisha) ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మోతె మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మూడు మండలాల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 15 అంశాలపై అధికారులతో చర్చించారు.
ఉపాధి హామీ పనులు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్, బోరుబావుల రీఛార్జ్, డ్రైనేజీ , ఫామ్ పాండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణ స్థితిని పరిశీలించారు.పశువుల నీటి తొట్టెలు, పశుగ్రాసం పెంపకం, వివో భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు.అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సందీప్ కుమార్, ఎంపీ ఓ కృష్ణవంశీ, పంచాయతీరాజ్ ఏఈ రంగారావు, ఏపీవో నగేష్, టి ఏ లు శ్రీహరి, ఊమ్లా నాయక్, పాల్గొన్నారు.