MLC సీట్ ను కైవసం చేసుకుంటాం
మాజీ జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి..
వికారాబాద్, అక్టోబర్- 4 : వికారాబాద్ మండల అధ్యక్షుడు G శివరాజ్ గౌడ్(Vikarabad Mandal President G. Shivaraj Goud) ఆధ్వర్యం లో నిర్వహించిన MLC ఎన్నికల మండల కార్యశాలకు ముఖ్య అతిథిగా పాల్గొని MLC సీట్(MLC seat) ని కైవసం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేసారు. గతం లో పట్టభద్రుల నియోజవర్గానికి అనేక మార్లు భారతీయ జనతాపార్టీ(Bharatiya Janata Party) కైవసం చేసుకుందని తెలియజేశారు.
పట్టభద్రులు అందరూ కూడా గతం లో మాదిరిగా BJP కి పట్టo కడుతారన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ఈ ఎన్నికల్లో తీసుకోవలసినటువంటి చర్యలను సూచించారు. ఏది ఏమైనా ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని భలపరుస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జ్ పాండు గౌడ్, అమరేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బస్వలింగం . సూర్య ప్రకాష్ రెడ్డి, గోపాల్ , రవీందర్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.