మీ అలవాట్లే మీ అవయవాలకు డేంజర్.. ఇప్పటికైనా మార్చుకోండి

15-11-2026 | 06:27pm

మన రోజువారీ జీవనశైలిలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలకు (Health Problems) దారితీయవచ్చు. ముఖ్యంగా చీకట్లో ఎక్కువసేపు మొబైల్ చూడటం, హెడ్‌ఫోన్స్‌లో అధిక శబ్దంతో పాటలు వినడం, తగినంత నిద్రపోకపోవడం, మానసిక ఒత్తిడికి (Mental Stress) గురికావడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

అలాగే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఫాస్ట్‌ఫుడ్ (Fast Food) తినడం, మద్యం సేవించడం, పొగతాగడం వంటి అలవాట్లు గుండె, కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. ఎక్కువసేపు ఆకలితో ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, అధికంగా తీపి పదార్థాలు, కారం, మసాలాలు తీసుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాఫీ, టీలు అతిగా తాగే అలవాటును తగ్గించుకోవాలి.

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం (Balanced Diet) తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, రోజూ వ్యాయామం (Daily Exercise) చేయడం అలవాటు చేసుకోవాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి!

మరిన్ని వార్తలు