పైల్స్‌కు చికిత్సే పరిష్కార మార్గం
కరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్ సీఈఓ సురేష్ కుమార్
కొత్తపల్లి, నవంబర్ 19 (విజయక్రాంతి): ఫైల్స్ అంటే సిగ్గుపడాల్సిన జబ్బు కాదు సకాలంలో సరైన వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకుంటే నయమయ్యే సాధారణ ఆరోగ్య సమస్య అని కరీంనగర్ పట్టణానికి చెందిన సన్ షైన్ హాస్పిటల్ సీఈఓ, స్పెషలిస్ట్ ఫైల్స్ సర్జన్, తాటిపాముల సురేష్ కుమార్(Dr. Suresh Kumar) చెపుతున్నారు.
నవంబర్ 20వ తేదీ ప్రపంచ ఫైల్స్ దినోత్సవం సందర్భంగా ఆయన వ్యాధి లక్షణాలు చికిత్స పద్ధతులపై ప్రత్యేక కథనం. ‘మలవిసర్జన సమయంలో రక్తం పడడం, మాంసం ముద్ద రావడం, మ లద్వారం దగ్గర నొప్పి కలిగి దురద మంట రావడం, కొందరిలో మలద్వారం నుండి రక్తస్రావం అవుతుండడం, మలవిసర్జన తర్వాత మనం పై రక్తపు చారల కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఉబకాయం కలిగి ఉండడం, ఎక్కువ బరువులు ఎత్తడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, మలబద్ధకం, ఎక్కువసేపు మలవిసర్జనకు బలవంతం చేయడం, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, నీళ్లు తక్కువ తీసుకోవడం వం టివి వ్యాధికి కారకాలు.
రోజువారీగా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకొని, ఆకుకూరలు, పండ్లు, ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. మలబద్ధకాన్ని నిర్ల క్ష్యం చేయకుండా ఉండాలి, నొప్పి తీవ్రంగా ఉండి, రక్తస్రావం ఎక్కువ అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి శస్త్ర చికిత్స లేజర్ ద్వారా చికిత్స చేస్తారు. చాలామంది సిగ్గుతో మెడికల్ షాపులో మందులు వాడడం, నాటువైద్యం చేసుకుని సమస్యను పెంచుకుంటున్నారు. ఇటువంటివి చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి’ అని డాక్టర్ సురేష్ కుమార్ తెలియాజేశారు.