రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన జిల్లా బాలికల హాకీ జట్టు
ఆదిలాబాద్, నవంబర్ 17, (విజయక్రాంతి) : రాష్ట్ర స్థాయి హాకీ క్రీడలో(State level hockey game) జిల్లా జట్టు ప్రతిభ కనబర్చి 3వ స్థానం సాధించి జిల్లాకు పేరు నిలపడం అభినందనీయం అని ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో అండర్-14 బాలికల హాకీ విభాగంలో సత్తాచాటిన జట్టును సోమవారం ఆదిలాబాద్ లో ఆయన శాలువాలతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ బిడ్డలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించడం గొప్ప విషయం అన్నారు.
వీరికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఆదిలాబాద్ పేరు నిలబెడతారన్నారు. వచ్చేసారి 1వ స్థానం సాధించాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, రామేశ్వర్, రవి, షబీర్, గోవింద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.