ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలి

17-11-2026 | 04:49pm

నాగిరెడ్డిపేట్, నవంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ఆసరా పెన్షన్(Aasara Pension) మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో గంగాధర్ల చేతుల మీద అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పత్రాలు పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ మంజూరు చేస్తూ పెన్షన్ పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.

ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించాలని మాఆశయం ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే తమ ధ్యేయం, ధర్మ రెడ్డి గ్రామంలో వితంతు పెన్షన్లు 10, దివ్యాంగుల పింఛన్ 3, గీతా కార్మికుల పింఛన్ 2, ఒంటరి మహిళల పెన్షన్ 2 ఆసరా పెన్షన్ లబ్ధి దారులకు మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో గంగాధర్, ఉప సర్పంచ్ జయరాజ్, పంచాయతీ కార్యదర్శి రమేష్,వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు దుర్గయ్య, శ్రీను, సాయిలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు