ఆంధ్రప్రదేశ్ టూ.. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కు పత్తి పంట

17-11-2026 | 04:26pm

ఉట్నూర్, నవంబర్17 ( విజయక్రాంతి ):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పలు జిల్లాలో ని పలు గ్రామాల రైతులు పత్తి పట్ల సాగు(Farmers are cultivating cotton) చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు  తెలంగాణ రాష్ట్రంలోని  ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణాజిల్లా  నూజివీడు, తిరువూరు తదితర ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర తలిపించకపోవడంతో  అక్కడి రైతులు దళారులకు పత్తి పంట విక్రయిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని వివిధ జిల్లాలు సాగు చేసే  పత్తి పంటకు క్వింటాల్ కు 8550 నుండి 8650 చెల్లించి కొనుగోలు చేసుకొని  లారీల ద్వారా అదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు  మహారాష్ట్రలోని యువత మాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి లారీల ద్వారా తీసుకు వెళ్తున్నారు. మంగళవారం ఆంధ్రాలోని  కృష్ణాజిల్లా  ప్రాంతం నుండి లారీలలో పత్తి నింపుకొని  వెళ్తున్నా చిత్రం ఇది.

మరిన్ని వార్తలు