బద్దిపెల్లి గ్రామంలో ఇన్నోవేషన్ ఇంపాక్ట్ కార్యక్రమం

17-11-2026 | 04:50pm

కొత్తపల్లి, నవంబర్ 17(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బద్దిపెల్లి గ్రామంలో(Baddipelli Village) తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(Telangana Farmers' Knowledge Centre)  కరీంనగర్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇంపాక్ట్ ప్రోగ్రాం (ఆవిష్కరణల ప్రభావ కార్యక్రమం) నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పదిహేను మంది రైతులకు వివిధ పంటల విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. 

ఒక్కొక్కరికి 8 కిలోల చొప్పున కరీంనగర్ మక్క-1 మొక్కజొన్న విత్తనాలు, డబ్ల్యూజిజి-42 పెసర విత్తనాలు, జెసిఎస్-1020 నువ్వుల విత్తనాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్వికె కోఆర్డినేటర్ మరియు హెడ్ డాక్టర్ పి మధుకర్ రావు మాట్లాడుతూ మొక్కజొన్న, పెసర మరియు నువ్వుల పంటల్లో విత్తన శుద్ధి ప్రాముఖ్యత, విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు, సాగు విధానాలు మరియు ఉత్తమ పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రీయ అవగాహన కల్పించారు.

తదుపరి  ఎఆర్ఎస్, కరీంనగర్ హెడ్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్  మాట్లాడుతూ జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు పద్ధతి గురించి తెలుపుతూ నేలను దున్నకుండా నేరుగా విత్తనాలు విత్తడం, సాగు ఖర్చులు మరియు సమయం తగ్గించుకోవడం, నేలలో తేమను సంరక్షించడం వంటి ప్రయోజనాలను వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ మరియు  రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు