పని దినాలు పెంచాలని ధర్నా
నిర్మల్ నవంబర్ 17 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శివాజీ బీడీ పరిశ్రమలో(Shivaji Beedi Industry) పనిచేస్తున్న కార్మికులకు పని దినాలు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం నర్సాపూర్ మండల్ రాంపూర్ శివాజీ బీడీ హెడ్ ఆఫీస్ ను వందలాదిమంది కార్మికులతో ధర్నా చేశారు .
రాజన్న మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కై 9వ తేదీ నుండి కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం చర్చలకు రాకపోవడం మొండి వైఖరి విడనాడి చర్చలకు రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రెక్కలు ముక్కలు చేసుకొని బీడీ పై బతుకుతున్న బీడీ కార్మికులను నాసిరకమైన తునికాకుసరఫరా చేస్తూ నాణ్యమైన బీడీలు తీసుకురావాలని బీడీ కార్మికులను ఒత్తిడి చేస్తున్నారు.
బీడీ కమిషన్ దారులు గంపలు సెంటర్‌కు తీసుకుపోయి మేనేజర్‌కు అప్పజెప్పితే ఒక్కొక్క గంప నుండి రెండువేల నుంచి పదివేల వరకు బీడీ చాటు చేస్తూ దోపిడీకి గురి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న.
ఉపాధ్యక్షులు ఆర్ రామ లక్ష్మణ్. జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎస్ గంగన్న.ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి. కె లక్ష్మి. సరోజన. గౌతమి. కళావతి. పోసవ్వ. శైలజ. స్రవంతి.కటకం గంగాధర్. కల్లూరు గంగాధర్. శివలింగం.సత్యం. నరేష్. రాజేందర్. బి నర్సయ్య. గంగాధర్. గోపి. భూమన్న.గంగన్న. తదితరులు పాల్గొన్నారు.