పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి

17-11-2026 | 04:42pm

నిర్మల్ నవంబర్ 17 ( విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు(Government employees) పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం(CPS Employees' Association) పిలుపుమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేశారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.

కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ డిఆర్ఓ రమేష్ రాథోడ్ కు వినతి పత్రం అందించారు.

మరిన్ని వార్తలు