చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
సర్పంచ్ లావణ్య రాజేష్,
మహదేవ్పూర్, నవంబర్ 14. (విజయక్రాంతి ): విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పెద్దంపేట గ్రామ సర్పంచ్ లావణ్య రాజేష్ అన్నారు. మంగళవారం పెద్దంపేట ప్రాథమిక పాఠశాల(Peddampeta Primary School) లో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓగా గోగుల అర్చిత, హెచ్ఎంగా దుర్గం మధుప్రియ, పీఈటీగా కుర్సం చిరంజీవి, ఉపాధ్యాయులుగా తాటిపల్లి సహస్ర, కుర్సం సాగర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ లావణ్య రాజేష్, ఉప సర్పంచ్ రాజు గౌడ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం పాల్గొని నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానుగుల బిక్షపతి, ఉపాధ్యాయులు సామల రూప, చిడం సునీత, గౌరివేని మల్లేశ్వరి, జాడి సువర్ణ, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మక్క, లక్ష్మి, బాణయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.