అరుణాచలం కు ప్రత్యేక బస్సు
నిర్మల్ నవంబర్ 17 ( విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో(RTC Nirmal Depot) ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా 23 నవంబర్ రోజు నిర్మల్ డిపో నుండి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. అరుణాచలంలో నవంబర్ 24 తేదీన జ్యోతి దర్శనం ఉంటుంది కావున ఈ బస్సు పెట్టవలసి వచ్చిందని ఆయన తెలిపారు.
నిర్మల్ నుండి చాలా మంది అరుణాచళేశ్వరుని భక్తులు ఉండడం వలన ప్రతి సం!! రం అరుణాచలానికి ప్రత్యేక బస్సు లు నడుపుతామని అయన తెలిపారు. ఈ బస్సు నవంబర్ 23 రోజు నిర్మల్ నుండి బయలుదేరి 24 రోజు కాణిపాకం లో వరహసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకొని 24 సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందని, అరుణాచలం లో గిరి ప్రదక్షిణ స్వామి వారి దర్శనం తర్వాత 25 తేదీన కంచిపురం బంగారు బల్లి వెండి బల్లి దర్శించుకొని శ్రీ కాళహస్తి లో వాయు లింగం దర్శించుకొని 26 వ తేదీన నిర్మల్ చేరుకుంటుంది.
ఇది మొత్తం నాలుగు రోజుల యాత్ర , ఛార్జి ఒకరికి రాను పోను 5220/- రూ!! లు ఉంటుందని ఆ మహశివుని దర్శించుకునే వారు ముందుగా మీ టికెట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని వివరాలకు 9959226003, 9440018549 లో సంప్రదించాలని డిపోమేనేజర్ తెలిపారు.