19 నుండి ఇందిరమ్మ బీమా నమోదు

17-11-2026 | 04:45pm

ఉట్నూర్, నవంబర్17 ( విజయక్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ బీమా పథకం(Indiramma Insurance Scheme)  లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు మండల అభివృద్ధి అధికారులు ప్రత్యేక అధికారులను నియమించారు.

ఉట్నూర్ డివిజన్లోని  ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గ్రామపంచాయతీ కేంద్రాలలో ప్రజల నుండి దరఖాస్తులలో స్వీకరించినందుకు తేదీలు సమయాన్ని  ప్రకటించారు.

ఈనెల 19 నుండి డిసెంబర్ 19 తేదీ వరకు నెలరోజులపాటు  గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించడంతోపాటు రేషన్ కార్డ్ నెంబర్ పై  కార్డు కలిగిన వారికి ప్రతి ఒక్కరికి  ప్రభుత్వం సరఫరా చేసిన వివరాలను  అందిస్తామని ఇంద్రవెల్లి ఎంపీడీవో  మహేందర్ తెలిపారు. ప్రభుత్వ తరపున ఇచ్చే దరఖాస్తు  అర్హులైన వారు తీసుకుని  బీమా పథకంలో నామిని పేరును  నమోదు చేసి ఇవ్వాలని  డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు  తెలిపారు.

మరిన్ని వార్తలు