ఈ నెల 13 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

11-11-2026 | 10:42pm

బేల నవంబర్ 11 (విజయక్రాంతి): బేల మండల పత్తి రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ శుభవార్త తెలిపింది. జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) పరిధిలోని బేల సబ్ మార్కెట్ యార్డులో నవంబర్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ప్రైవేటు వ్యాపారులతో పాటు సీసీఐ (CCI) ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు తమ పత్తిని శుభ్రపరిచి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని మార్కెట్ కమిటీ అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు