స్వాములకు అన్నదానం చేయడం గొప్ప పుణ్యకార్యం

11-11-2026 | 10:55pm

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ

కోదాడ నవంబర్ 11 (విజయక్రాంతి): దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు, ఇతర భక్తులకు గత 13 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదానం చేయడం ఎంతో గొప్ప పుణ్యకార్యమని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) కొనియాడారు. బుధవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో ఉన్న గాలి రమేష్ నాయుడు బ్రదర్స్ స్థలంలో ఏర్పాటు చేసిన 13వ సంవత్సరం అన్నదాన  కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కోదాడ మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమా వెంకటరత్నం బాబు, నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడుతో కలిసి స్వాములకు అన్నదానాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ  మాల ధారణ లో ఉన్న  స్వాముల ఆకలి తీర్చడం గొప్ప పుణ్యకార్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు, సీతారాం సింగ్, గంగిరెడ్డి రాకేష్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ చైతన్య నాయక్, సైదా నాయక్, దేవాలయ గురుస్వాములు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు