మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
11-11-2026 | 10:56pm
బేల నవంబర్ 11 (విజయక్రాంతి): భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి, అక్షరాస్యతకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అందించిన సందేశాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే. మహేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ నవీన్, సాయి కృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.