నూతన కార్మిక చట్టాలపై ముగిసిన మూడు రోజుల శిక్షణ

11-11-2026 | 11:00pm

నస్పూర్, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా నాలుగు కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్స్(New Labor Codes)పై నిర్వహించిన మూడు రోజుల శిక్షణ బుధవారంతో ముగిసింది. నూతన లేబర్ చట్టాలపై అవగాహనే లక్ష్యంగా బెల్లంపల్లి రీజియన్ అధికారులకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి గెస్ట్ హౌజ్ కాన్ఫరెన్స్ హాల్ లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

సింగరేణి సంస్థ ప్రముఖ లీగల్ ఎక్స్పర్ట్ పార్వతీశం ఆధ్వర్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, ఎస్టిపిపి నుంచి పర్సనల్, మైనింగ్, ఇంజనీరింగ్, లా, ఫైనాన్స్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ లకు నూతన కార్మిక చట్టాలు, కంపెనీలు, పరిశ్రమలు, వాటి ప్రభావాలను ఉదాహరణలతో వివరణాత్మకంగా పార్వతీశం వివరించారు.

యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని నూతన కార్మిక చట్టాల పట్ల అధికారులందరు అవగాహన కలిగి ఉండాలని జీఎం శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం బి. కృష్ణ ప్రసాద్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎస్ఓటూ జీఎం స్వామి రాజు, బెల్లంపల్లి ఏరియా ఇంజనీర్ వీరన్న,  మందమర్రి ఏజీఎం సంతోష్ కుమార్, ఎస్టీపీపీ పర్సనల్ (హెచ్ఓడీ) ఎస్ వి రాజేశ్వర్ రావు, వివిధ గనుల మేనేజర్లు, ఇంజనీర్లు, పర్సనల్ విభాగం అధికారులు, లా, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు