విద్యార్థుల హక్కుల కోసం ఐక్య పోరాటం

11-11-2026 | 10:50pm

ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి

మహాదేవపూర్, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్యార్థుల హక్కుల కోసం ఐక్య పోరాటం చేస్తామని ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి(AISF District President Burra Swathi) అన్నారు. మహాదేవపూర్ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు సభ్యత్వం స్వీకరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలు, ఫీజుల భారం, ఉపాధి అవకాశాలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని, మరింత మంది విద్యార్థులు సభ్యులుగా చేరి విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని బుర్ర స్వాతి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు