ఓబీసీ మండల అధ్యక్షుడిగా దందేర విలాస్

11-11-2026 | 11:15pm

బెజ్జూర్ నవంబర్ 11 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల ఓబీసీ మండల అధ్యక్షుడు దందేరా విలాస్(Dandera Vilas)ను బుధవారం సాల్వతో ఘనంగా సత్కరించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్. పాల్వాయి హరీష్ బాబు  ఆదేశానుసారంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా ఇంచార్జి విష్ణుదత్తు ఆధ్వర్యంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఎల్కరి దామోదర్ అధ్యక్షతన బెజ్జూర్ మండల ఓబీసీ మండల అధ్యక్షునిగా దందెర విలాస్ ను పాపన్ పేట్ నివాసిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

తనపై నమ్మకంతో ఈ బాధ్యతను  అప్పగించినందుకు ఎమ్మెల్యేకు,జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎల్కరి దామోదర్ కు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన గా దేశం,ధర్మం,పార్టీ కోసం తను మను ధన పూర్వకంగా నా బుద్ధి, మనస్సు,ను ఉపయోగించి పనిని బాధ్యతగా చేస్తానని ఓబీసీ వారి అందరికీ నావంతు బాధ్యతగా సహకారం చేస్తానని అందరూ ఓబీసీ బంధువులు నాకు సహకరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జాతి దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు