స్వగ్రామంపై మమకారంతో సొంత ఖర్చులతో సేవా కార్యక్రమం..

11-11-2026 | 11:03pm

గుద్దేటి ఆంజనేయులుకు అభినందనలు

శివంపేట్ నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(Telangana Wall Painting Artist Association)కు చెందిన గుద్దేటి ఆంజనేయులు(చిన్నగొట్టిముక్కుల) తన స్వగ్రామంపై ఉన్న మమకారంతో సొంత ఖర్చులతో సేవా కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలిచారు. తన ఊరి కోసం తన వంతుగా ఆర్థిక సహకారం అందిస్తూ సామాజిక సేవ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు.

స్వగ్రామ అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. సొంత ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహకారం అందించాలనే తపనతో ఆంజనేయులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యత ఉంటే ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో సేవ చేయవచ్చని ఆయన నిరూపించారని పలువురు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు