జిల్లా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ జైసింగ్ రాథోడ్

15-11-2026 | 02:26pm

* ఆదిలాబాద్ రిమ్స్ నుంచి నాగర్‌కర్నూల్‌కు బదిలీ

* ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రియ యాదావిదిగా ప్రొఫెసర్‌గా కొనసాగింపు

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ జైసింగ్ రాథోడ్(Jaisingh Rathod) నియమితులయ్యారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుంచి ఆయనను నాగర్‌ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుప్రియ యాదావిదిని ప్రొఫెసర్‌ (ఒబీజీ)గా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు