ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన యోధుడు
బిర్సా ముండా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఆదివాసి వీరుడు భగవాన్ బిర్సా ముండా(Birsa Munda) జయంతిని హీరాసుఖా ఆదివాసి జాగృతి సొసైటీ(Heerasukha Adivasi Jagruti Society) ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar), ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan), అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసి జెండాను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే పాయల్ మాట్లాడుతూ.. కేవలం 25 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని(British Empire) గడగడలాడించిన గొప్ప ఆదివాసి యోధుడు బిర్సా ముండా అని కొనియాడారు. భౌతికంగా ఆయన మన ముందు లేకపోయినా, ఆయన ఆలోచనలు, ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి, హీరాసుఖా ఆదివాసి జాగృతి సొసైటీ అధ్యక్షుడు సిడాం రాం కిషన్, తాబాజీ, మనోహర్, గెడం అనిత, తదితరులు పాల్గొన్నారు.