విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించడమే లక్ష్యం

15-11-2026 | 09:25pm

వేమనపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) వేమనపల్లి మండల కేంద్రంలోని అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ఆదివారం విద్యార్థులచే శ్రీరామ నామ లిఖిత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు భక్తితో “శ్రీరామ జై రామ జయ జయ రామ” అనే నామాన్ని లిఖిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు. అనంతరం నిర్వాహకులు విద్యార్థులకు ప్రసాద వితరణ చేశారు.

ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి ఆదివారం సకాలంలో అధిక సంఖ్యలో ఆలయానికి పంపించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు