నాగల్గిద్దలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
ఈ నెల 17న ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాల అందజేత
నాగల్గిద్ద, నవంబర్ 15 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి మహేశ్వరరావు(Mandal Development Officer Maheshwar Rao) తెలిపారు.
ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, పత్రికా విలేకరులు, ఆహ్వానితులు సకాలంలో హాజరుకావాలని మహేశ్వరరావు కోరారు.