ఆకుల సిద్దిరాములు మృతి పట్ల కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపం
చేగుంట నవంబర్ 15,విజయక్రాంతి : చేగుంట(Chigunta) మాజీ జడ్పీటీసీ ఆకుల సిద్దిరాములు(Akula Siddiramulu) మృతి పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆకుల సిద్దిరాములు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన మృతి చేగుంట ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు