ఏటూరునాగారంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటు చేయాలి

15-11-2026 | 09:52pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 15, విజయక్రాంతి: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో ఎంఎస్ నంబర్ 58 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు(Establishment of New Courts) అనుమతి కల్పించిన నేపథ్యంలో ములుగు జిల్లాకు(Mulugu District) మంజూరైన జ్యూడిషియల్  పస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును(Judicial First Class Magistrate Court) ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని ఆదివారం  వెంకటాపురం(Venkatapuram) మండల కేంద్రము లోని అర్ అండ్ బి అతిథి గృహ ఆవరణలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏటూరునాగారం(Eturunagaram), వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి మండలాల ప్రజలకు సత్వర న్యాయం ఈ కోర్టు ఏర్పాటు ఎంతో అవసరమని అఖిలపక్షం నాయకులు వివరించారు.

ఈ ఆరు మండలాల పరిధిలో సుమారు రెండు లక్షల మంది జనాభా ఉండగా, 1,500 నుంచి 2,000 వరకు కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని  ఈ ప్రాంతాలు ఎక్కువగా ఆదివాసీ గిరిజనులు, పేదలు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కలిగిఉన్నారని, వివిధ క్రిమినల్, సివిల్ కేసుల విచారణ కోసం సుదూర ప్రాంతాలను కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని కోర్టుకు వెంకటాపురం నుంచి సుమారు 150 కి.లు, టేకులగూడెం నుంచి 140 కి.లు, మంగపేట సరిహద్దు ప్రాంతాలు, కన్నాయిగూడెం మారుమూల గ్రామాల నుంచి సుమారు 130 కిలోమీటర్ల మేర పరిశ్రమలు వస్తోందని వివరించారు.

సరైన బస్సు సౌకర్యాలు లేకపోవడంతో కక్షిదారులు, నిందితులు, సాక్షులు సమయానికి కోర్టులకు చేరుకోలేకపోతున్నారని, దీంతో విచారణలు వాయిదా పడుతూ కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి వాయిదాకు ప్రయాణ ఖర్చులు భరించడం పేద ఆదివాసీ కుటుంబాలకు భారంగా మారింది. ఏటూరునాగారం ఇప్పటికే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయం, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్) కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలు పరిపాలనాపరంగా ముఖ్యమైన కేంద్రంగా ఉన్నాయని, ఇక్కడ కోర్టు ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి సత్వర న్యాయం పొందే హక్కు ఉంది, ముఖ్యంగా మారుమూల ఏజెన్సీలలో నివసించే గిరిజనులు, పేదలు, బలహీన వర్గాలకు న్యాయసేవలు చేరువ కావాల్సిన అవసరం ఉందని పలువురు  వక్తలు పేర్కొన్నారు. ఏటూరునాగారంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుతో పాటు సివిల్ జాయింట్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసేమని తెలిపారు.ఏజెన్స్ ప్రాంతంలో  పెసా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి సంభందిత అధికారులకు పంపలాని సూచించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దాగం ఆదినారాయణ, సున్నం రమేష్, సిడం రవి కుమార్, పూర్ణచందర్, ప్రణయ్  ప్రసాద్ , రవి ప్రసాద్ రెడ్డి మాటూరి సీతారామయ్య, చిరంజీవి, రంజిత్ కుమార్, రాంబాబు, శాంత కుమారి, సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రావు. కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు  శివ , బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం వివేక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్, టిడిపి నాయకులు తాళ్లూరి లక్ష్మణరావు, ఆదివాసి నాయకులు కోర్స నరసింహమూర్తి, పూనం సాయి, సిద్ధ బోయిన సర్వీస్, పర్సిక సతీష్, వెంకటాపురం మండల  సర్పంచులు, ఉప సర్పంచ్లు, దళిత సంఘాలు, కుల సంఘాలు, మీడియా మిత్రులు, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు