బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

15-11-2026 | 09:16pm

జిఇసిఓ భారతి

బెజ్జూర్ నవంబర్ 15 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం(Kasturba Gandhi Vidyalaya)లోని విద్యార్థినిలు త్రాగునీరు, ఆహారం సమస్యలు ఉన్నాయని పాఠశాల ముందే ఆందోళన చేపట్టారు ఇట్టి విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి డాక్టర్ సునీత అక్కడికి చేరుకొని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

త్రాగునీటి సమస్య ఆహారం సమస్య చెప్పడంతో వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని విద్యార్థినులకు హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన విరమించకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్రూపులు గ్రూపులుగా సమస్యలు లేనివి ఉన్నట్టు తప్పుడు, మాటలు తిట్టారని, హోంవర్క్ ఎక్కువ ఇచ్చారని, ఆదివారం రోజు హోంవర్క్ ఇవ్వద్దని ఇలా విద్యార్థినిలు చెప్పడంతో ఇట్టి విషయమై డిఈసిఓ భారతికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని అసలు సమస్యను గుట్టు రట్టు చేశారు.

విద్యార్థినీలను రెచ్చగొట్టి అందులో పనిచేసే ఒకరికి మాత్రం ఆటలు సాగడం లేదని విద్యార్థినిలకు ఎందుకోసం దేనికోసం అని తెలియకుండానే రాత్రి సమయంలో సంతకాల సేకరణ చేసి ప్రిన్సిపల్ పై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు.ఆందోళన చేపట్టమని రెచ్చగొట్టడంతో విద్యార్థినిలు ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. దీనికి పూర్తి విద్యార్థులను రెచ్చగొట్టే విషయంలో సూత్రధారి పూర్తి వివరాలు విద్యార్థినిలు అధికారికి వెల్లడించారు. దీనితో ఆమెపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పుడు మాటలు విని చదువు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థినిలకు సూచించారు.

మరిన్ని వార్తలు