దాసరిపల్లి సర్పంచ్‌పై ఏడుగురు వ్యక్తుల దాడి!

15-11-2026 | 09:28pm

బిజ్వారం శివారులో బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి దాడి..

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) మల్దకల్ మండల పరిధిలోని దాసరిపల్లి గ్రామ సర్పంచ్ పూజారి వెంకటేష్(Pujari Venkatesh) (33)పై ఏడుగురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

మల్దకల్ ఎస్సై కే. శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో సర్పంచ్ పూజారి వెంకటేష్ మల్దకల్ నుంచి బైక్‌పై బిజ్వారం శివారు ప్రాంతం మీదుగా వెళ్తుండగా ఏడుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించి దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనలో వెంకటేష్ గాయపడినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించి, దాడికి గల కారణాలు, నిందితుల వివరాలను సేకరిస్తున్నట్లు మల్దకల్ ఎస్సై కే. శ్రీహరి తెలిపారు.

మరిన్ని వార్తలు