మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అందజేత
వరంగల్, (విజయక్రాంతి): వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి(Kakatiya Medical College, Warangal) తెలంగాణ నేత్ర, అవయవ శరీరధాతల అసోసియేషన్(Telangana Eye and Organ Donors Association) ప్రెసిండెంట్ మల్లారెడ్డి(Malla Reddy) ఆధ్వర్యంలో మరణించిన ఓ వ్యక్తి పార్థివదేహాన్ని అందజేశారు. హన్మకొండ బట్టుపల్లి మదర్ ఫౌండేషన్(Mother Foundation, Battupalli, Hanamkonda) ఆధీనంలో పోషింపబడుతున్న ఆనందం (50) అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం మరణించగా నిర్వాహకులు సంతోష్ సహకారముతో సమాజహితం కోసం తెలంగాణ నేత్ర అవయవ శరీరధాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్(Kakatiya Medical College) ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ఆదేశంతో అనాటమీ విభాగ పతి డాక్టర్ శశికాంత, పీజీ డాక్టర్స్ జోష్ణ రావు, డాక్టర్ సోహెబ్, సిబ్బంది ప్రేమ కుమార్, యాదగిరి, ప్రణయ్ పార్థివ దేహాన్ని అప్పగించిన్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ కూరాకుల భారతి, పెండ్లి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.