రెడ్డిలు ఆర్థికంగా ఎదిగి పేద ప్రజలకు అండగా ఉంటారు

15-11-2026 | 09:56pm

 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

 బోయినపల్లి: నవంబర్ 15( విజయ క్రాంతి): రెడ్డి లు ఆర్థికంగా ఎదిగి పది మందికి సాయం చేసే గుణం ఉంటుందని, అంతేకాక పెద ప్రజలకు అండదండగా ఉంటారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Choppadandi MLA Medipalli Satyam) అన్నారు. మండలం లో రెడ్డి సంఘ భవనానికి తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) బోయినపల్లి మండల కేంద్రంలో ఆదివారం బోయినపల్లి మండల రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. 

అంతకుముందు మండల రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం నుండి ప్రమాణ స్వీకార వేదికకు రెడ్డి కులస్తులు  మహిళాలు బారి ర్యాలీ గా తరలి రాగా మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు చల్ల శ్రీనివాసరెడ్డి(Challa Srinivasa Reddy) తో పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రెడ్డిలు కష్టపడి  వ్యవసాయ రంగం తో పాటు రాజకీయ రంగంలో కూడా ముందువరుసలో ఉంటున్నారని అన్నారు. తనకు కూడా చిన్నప్పటి నుండి రెడ్డి స్నేహితులు ఎంతోమంది ఉన్నారని, చాలామంది రెడ్డి కులస్తులు తనకు ఎంతో సహకరించారని తెలిపారు.

బోయినపల్లి మండల సంఘ భవనం స్థలం  కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో చాలామంది రెడ్డిలకు నామినేటెడ్ పోస్టులు కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. వరి వేస్తే ఉరి అని  బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుందన్నారు.

ఈ కార్యక్రమం లో మైత్రీ గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ముచ్చిడి మోహన్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు ఏనుగు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాజీ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, కోరెం సింగిల్ విండో చైర్మన్ వన్నెల మమత రమణారెడ్డి, సర్పంచులు చింతలపల్లి కవిత వెంకట్రెడ్డి నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి. జిల్లా రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు డబ్బు తిరుపతి రెడ్డి, ఏ ఏం సి మాజీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి,

కార్యదర్శిమిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి  జిల్లా రెడ్డి సంఘం సీనియర్ నాయకులు డబ్బు వెంకట్ రెడ్డి లతో పాటు మండల రెడ్డి కులస్తులు ఉన్నారు.

మరిన్ని వార్తలు