ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పేర్ల నమోదు

16-11-2026 | 04:17pm

ప్రతి ఇంటికి వెళ్లి అర్హుల వివరాలు సేకరించాలి: ఎంపీడీఓ మహేష్ కుమార్

బేల నవంబర్ 16 (విజయక్రాంతి): మండలంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఇందిరమ్మ జీవిత బీమా(Indiramma Jeevitha Bima Scheme) పథకానికి సంబంధించిన పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని ఎంపీడీఓ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఐకేపీ ఏపీఎంతో కలిసి సంబంధిత అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎంపీడీఓ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ వీవోలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించి, పేర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి అర్హుడి వివరాలు నమోదు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు