తీన్మార్ మల్లన్నకి భద్రత పెంచాలి

16-11-2026 | 04:00pm

వరంగల్, నవంబర్ 16(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) చేపట్టిన రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా మోత్కూర్ మండలం అనాజిపురం వద్ద మల్లన్న వ్యక్తిగత వాహనంపై లారీ దూసుకెళ్లి యాక్సిడెంట్ చేసిన ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ జోక్యం చేసుకొని మల్లన్న కి భద్రత పెంచాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మల్లన్నని భౌతికంగా హతమార్చడానికి యాక్సిడెంట్ చేసినట్లుగా అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మల్లన్న పాదయాత్రకి ప్రభుత్వం ఎలాంటి పోలీస్ భద్రతను కూడా కల్పించకపోవడం వలన పాదయాత్రలో అనేక అపసృతులు చోటు చేసుకుంటున్నాయని, యాక్సిడెంట్ పై ప్రభుత్వం, పోలీస్ శాఖ సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అలాగే పాదయాత్రకి పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యాక్సిడెంట్ లో మరణించిన చందన కుటుంబాన్ని, గతంలో బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని, కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రవర్ణాల దాడిలో పసి బిడ్డని కోల్పోయిన రజక మహిళని ఆదుకున్న మల్లన్న పై రాజకీయ విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరచటానికి బీసీ వాదం ప్రజల్లోకి వెళ్లకుండా పాదయాత్రని ఆపటానికే యాక్సిడెంట్ కుట్రకు తెర తీశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు