జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ టౌన్, నవంబర్ 16 (విజయక్రాంతి): జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్(Additional Collector Anil Kumar)కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, ప్రతినిధులు రంగా చౌదరి ఉమ్మ గాని మధు, సహదేవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.