మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

16-11-2026 | 04:03pm

చేగుంట నవంబర్ 16, (విజయక్రాంతి) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి చేగుంట మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాషాబోయిన భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్  సోలిపేట ప్రసాద్ రెడ్డి, జిల్లా నాయకులు జూకంటి రాజా గౌడ్, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య యాదవ్, వడియారం గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ , సండ్రుగు శ్రీకాంత్, నళిని గౌడ్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు