ఖేలో ఇండియాపై విస్తృత ప్రచారం చేపట్టాలి
ఆసిఫాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడలపై జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, క్రీడల శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, ఎండీ సోని బాలదేవితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
జిల్లాలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యువత, క్రీడాకారులను భాగస్వాములను చేయాలని తెలిపారు.జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నుంచీ కలెక్టర్ కె.హరిత హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సేవల, క్రీడా శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.