కొత్త బడి కట్టించండి సార్..!

16-11-2026 | 03:56pm

ప్రాణభీతితో చదువుసాగడం లేదు..

అదనపు కలెక్టర్ కు విద్యార్థుల వేడుకలు 

మహబూబాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): శిధిల్లంగా మారిన పాఠశాలలో చదువు కోవాలంటే భయమేస్తోంది సార్.. వెంటనే పాత బడిని తొలగించి కొత్త బడిని నిర్మించి ఇబ్బందులు తొలగించి చదువు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటూ పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి అనిల్ కుమార్(Additional Collector Anil Kumar)కు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు వినతి పత్రం అందజేశారు.

పాఠశాల భవనం పూర్తిగా శిథిలమై ఎప్పుడు కూలి పోతుందో తెలియక వరండాలో అన్ని తరగతులు ఒకే చోట నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యాభ్యాసానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ద్వారా పాఠశాల నూతన భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించి మా భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని విద్యార్థులు అదనపు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు