కశ్మీర్లో భద్రతపై సీఆర్పీఎఫ్ డీజీ కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని సీఆర్పీఎఫ్ జమ్మూకశ్మీర్ జోన్ ప్రత్యేక డీజీ సందీప్ ఖిర్వార్(CRPF Special DG Sandeep Khirwar) వెల్లడించారు. అయితే ఇంకా కొన్ని భద్రతాపరమైన సవాళ్లు మిగిలి ఉన్నాయని, వాటిని సమష్టి కృషితో అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణ(Maintenance of law and order) కేవలం భద్రతా బలగాలు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని.. ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజల సహకారంతోనే పరిస్థితులు ఈ స్థాయికి చేరుకున్నాయని అభినందించారు. మరోవైపు శీతాకాలంలో వాతావరణ మార్పుల(Climate change) కారణంగా భద్రతా బలగాలకు అదనపు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఇటీవల గాయపడిన జవాన్లు 92 బేస్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్నారని, ఢిల్లీకి తరలించిన ఇద్దరు కూడా కోలుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ఆపరేషన్లు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పించిన ఖిర్వార్.. వారి కుటుంబాలకు భద్రతా బలగాలు అండగా ఉంటాయని తెలిపారు.