రైలు నుంచి పడిపోయి ప్రయాణికుడికి గాయాలు..
బెల్లంపల్లి: రైల్వే స్టేషన్(Railway Station) సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన బొమ్మల కమలహాసన్ (35) వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి ఎడమ కాలు పూర్తిగా తెగిపోయింది. రైల్వే సిబ్బంది సమాచారంతో బెల్లంపల్లి 108 సిబ్బంది ఈఎంటీ నరేష్, పైలట్ సంపత్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి(Bellampalli Government Hospital) తరలించగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సకాలంలో గాయపడిన కమల్ హాసన్ ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రి కి తరలించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని పలువురు అభిందచారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.