విద్య ద్వారానే సమాజ అభివృద్ధి

11-11-2026 | 11:29pm

ప్రపంచ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో పశ్చిమ విద్యారంగంలో మరో ముందడుగు 

హనుమకొండ, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం కాజీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశం ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంప్లాయ్‌మెంట్ సర్వే నిర్వహించిందని తెలిపారు. ఈ సర్వే విశ్లేషణలో సమాజంలోని కుటుంబాలు, కులాలు, వర్గాలు అభివృద్ధి చెందడానికి విద్యే ప్రధానమైన సాధనమని స్పష్టమైందన్నారు.

రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో విద్యారంగంలో పటిష్టమైన పునాదులు వేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ ప్రారంభించిన ‘యంగ్ ఇండియా’ పత్రిక స్ఫూర్తితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశామని, ఒక్కో పాఠశాలకు సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే ప్రాంగణంలో కలిసి చదువుకునేలా ప్రత్యేక విద్యావిధానాన్ని రూపొందించామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమ బోధన, ఆధునిక సదుపాయాలు, విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్యను అందించి సమానత్వం, సామాజిక సమైక్యత, సోదరభావం పెంపొందించేలా ఈ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అదే విధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్య అందించే ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్యాబోధన, ఆధునిక తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, టైలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు ఉచితంగా అందిస్తామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను సెమీ రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తామని, విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే అందిస్తామని చెప్పారు. వైద్య నిపుణుల సూచనలతో రూపొందించిన అల్పాహారంలో వారానికి ఆరు రోజులు పౌష్టికాహారం, ప్రత్యామ్నాయ రోజుల్లో పాలు, రాగిజావ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను ప్రభుత్వ రవాణా సదుపాయంతో తిరిగి వారి ఇళ్లకు చేర్చుతామని పేర్కొన్నారు. పిల్లలు విద్యతో పాటు తల్లిదండ్రులతో కుటుంబ అనుబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క వివరించారు. రాత్రి వేళల్లో కుటుంబ సభ్యులతో గడుపుతూ, పగటిపూట అత్యుత్తమ విద్యా సదుపాయాలను పొందేలా ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పరిశుభ్రమైన వాతావరణంలో కేంద్రీకృత వంటశాలల ద్వారా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్ర…

మరిన్ని వార్తలు