ద్విచక్ర వాహనాల దొంగిలించిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆరు కేసులు ఛేదించిన జవహర్ నగర్ పోలీసులు.. ఐదు వాహనాల గుర్తింపు
జవహర్ నగర్, నవంబర్ 11 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు 17 ఏళ్ల బాలలను జవహర్ నగర్ పోలీసులు(Jawahar Nagar Police) అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు దొంగతనం కేసులను ఛేదించి, ఐదు ద్విచక్ర వాహనాలను గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 15న యాప్రాల్ క్రాస్ రోడ్డు వద్ద బేకరీ ముందు పార్క్ చేసిన హోండా యాక్టివా అపహరణకు గురైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చెన్నాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు బాలలను పట్టుకున్నారు. విచారణలో వారు డూప్లికేట్ తాళాలతో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించారు.
ఛేదించిన కేసులు: జవహర్ నగర్లో 3 కేసులు, తుకారాంగేట్, బోయిన్పల్లి, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క కేసు చొప్పున మొత్తం ఆరు కేసులను పోలీసులు ఛేదించారు.ఐదు వాహనాలను దర్యాప్తులో గుర్తించి, స్వాధీనం లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసే ప్రక్రియ చేపట్టారు. హోండా షైన్ వాహనాన్ని అల్వాల్ పోలీసులు సురక్షిత కస్టడీ కోసం కర్కానా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.అదుపులోకి తీసుకున్న ఇద్దరు బాలలను చట్టపరమైన ప్రక్రియ అనంతరం మేడ్చల్‌లోని ఎనిమిదో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ జువైనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఈ కేసును డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి. శివప్రసాద్, ఎస్ఐ ఎస్. భాస్కర్‌రెడ్డి, క్రైమ్ సిబ్బంది దర్యాప్తు చేశారు.