జీసీడీవోగా విజయలక్ష్మి నియామకం
11-11-2026 | 11:23pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా జీసీడీఓగా విజయలక్ష్మి(Vijayalakshmi) నియమితులయ్యారు. ఇప్పటివరకు విధుల్లో ఉన్న యద్దన పూడి గాయత్రి స్థానంలో వి ఎస్ లక్ష్మిపురంకు చెందిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి డిఈవో కే.అనిల్ కుమార్ చేతుల మీదుగా విజయలక్ష్మి ఉత్తర్వులు అందుకున్నారు.