నిస్సహాయులకు న్యాయ సహాయం అందించడం అందరి బాధ్యత

11-11-2026 | 11:17pm

సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి మహతి వైష్ణవి

భూపాలపల్లి టౌన్, నవంబర్ 11 (విజయక్రాంతి): న్యాయ సేవల దినోత్సవం ఏర్పడిన ఉద్దేశం చాలా గొప్పదని ఫలాలు నిస్సహాయులకు చేరవేయడం అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి మహతి వైష్ణవి(Mahathi Vaishnavi) అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ సివిల్ కోర్ట్ ప్రాంగణంలో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేయగా వారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలకు, మహిళలకు, వయోవృద్దులకు, ఎస్సీ ఎస్టీలకు, ఆర్థికంగా వెనకబడిన వారికి న్యాయ సహాయం అందించడం న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం అన్నారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి అఖిల మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు, గ్రామ న్యాయ సహాయ కేంద్రాలు, శిక్షణ పొందిన మధ్యవర్తులతో పాటు చాలా పద్దతుల ద్వారా న్యాయ సహాయం అందించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, పరిపాలన అధికారి పారిజాతం, సూపరింటెండెంట్ రఘురాం, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు