తొలి విద్యా మంత్రి మౌలానా సేవలు మరువలేనివి

11-11-2026 | 11:21pm

పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యులు లయన్ అశ్విని చంద్రశేఖర్

దేవరకద్ర నవంబర్ 11 (విజయక్రాంతి): భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా రంగానికి అందించిన సేవలు మరువలేనివని పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యులు లయన్ అశ్విని చంద్రశేఖర్(Ashwini Chandrashekar) అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో బుధవారం ఆయా పాఠశాలల హెచ్ యంలు  కోటకద్ర మురళీధర్, ఎస్. కల్పనల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యులు లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ శాస్త్రీయ, సాంకేతిక విద్యా రంగాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు.

మౌలానా విద్యాభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆ మహనీయుడి జయంతి రోజైన నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. అబుల్ కలాం ఆజాద్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ పల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల హెచ్ యం లు, కె.మురళీధర్,ఎస్. కల్పన, ఉపాధ్యాయులు కె కె శ్రీనివాస్,డి.శంకర్,  మదన్ మోహన్, కావాలి సుజాత, అశ్విని చంద్రశేఖర్, బి. విజయ లక్ష్మీ, నాగేశ్వర్ రెడ్డి, ఫాతిమా, ఆంజనేయులు, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు