తాళం పగలగొట్టి బంగారం వెండి నగదు చోరీ
07-11-2026 | 11:18pm
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Toopran Municipality) లోని ప్రగతి నగర్ కాలనీలో చాట్ల రాము గృహంలో భారీ స్థాయిలో చోరీ జరిగినట్లు పరిసరాల స్థానికులు తెలిపారు. కామారెడ్డి కి చెందిన రఘు గత కొన్ని రోజులుగా తూప్రాన్ పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. పండుగ నిమిత్తం మూడు రోజుల క్రితం గ్రామానికి వెళ్లారు, ఇదిలా ఉండగా శనివారం ఇంటికి తిరిగి రాగా ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందర అయి ఉండడాన్ని గమనించి చూస్తే అల్మారీ లో ఉన్న ఐదు తులాల బంగారు నగలు, 20 తులాల వెండి, లక్ష నగదు దోచుకెళ్లినట్లు సమాచారం అందించగా ఘటనా స్థలికి పోలీసులు వచ్చి పరిశీలించారు.