శ్రీపాద మార్గు నాలుగు వరుసల రహదారికి భూసేకరణ

07-11-2026 | 11:17pm

భూసేకరణకు రైతులు సహకరించాలి

మంథని ఆర్డీవో సురేష్

మంథని,(విజయక్రాంతి): శ్రీపాద మార్గు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలని మంథని ఆర్డీవో సురేష్ కోరారు. మంథని మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఆర్డీవో మాట్లాడారు. అంగుళూరు ప్రాంతానికి సంబంధించిన శ్రీపాద మార్గు నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరుగుతుందని, భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, భూముల సర్వే, కొలతలు, రికార్డుల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. భూములకు సంబంధించి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు